వాళ్లను చూసి నేర్చుకోండి.. ఎంపీలు ఏం చేస్తున్నారు: పవన్

మంగళవారం, 19 డిశెంబరు 2017 (09:47 IST)
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమిళ ప్రజలను చూసి నేర్చుకోండని హితవు పలికారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల వెనుక అక్కడి నేతలు నిలబడుతున్నారని.. మన రాష్ట్రంలో నేతలు మాత్రం అదే తరహా సమస్య పరిష్కారానికి ఎందుకు ముందడుగు వేయట్లేదని పవన్ అన్నారు. ఏపీ ఎంపీలంతా కలిసి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకునే దిశగా ఢిల్లీకి వెళ్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవాలని కోరారు. ఎంపీలంతా మోదీకి వినతి పత్రాన్ని సమర్పించాలని కోరారు. 
 
మన ఎంపీలు తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలని, నష్టాల్లో ఉన్నప్పటికీ, సేలం స్టీల్ ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా ఆ రాష్ట్ర సర్కారు అడ్డుకుంటున్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు. ఏపీ నేతలను ఎవరు ఆపుతున్నారో అర్థం కావడం లేదని పవన్ ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. ఇప్పటికే రాష్ట్ర విభజన తరువాత అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా వంటి రాజ్యాంగ పరమైన హామీలను సైతం నెరవేర్చలేదని పవన్ గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు