కౌలు రైతు కుటుంబాలకు పరామర్శ.. లక్ష ఇచ్చిన జనసేనాని

శనివారం, 23 ఏప్రియల్ 2022 (15:57 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఇందుకోసం ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. 
 
కౌలు రౌతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థికసాయం చేస్తున్నారు. ఇందుకోసం జనసేన కౌలు భరోసా యాత్రను పవన్ చేపట్టారు. 
 
ముందుగా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లిఖార్జున కుటుంబాన్ని పరామర్శించి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 
 
అనంతరం లింగపాలెం మండల నుంచి చింతలపూడికి వెళ్లి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన వెంట నాయకులు నాదెండ్ల మనోహర్ జిల్లా నాయకులు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు