అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళలో కేంద్రం 36 సార్లు మాట మార్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పైగా, అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మనిషి ముందు మాట్లాడేది ఒకటి.. వెనుక చేసేది మరొకటి అని, అందువల్లే ఆయనతో విభేదించినట్టు పవన్ ప్రకటించారు.
పవన్ చేపట్టిన పోరాటయాత్రలో భాగంగా, ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సాగుతోంది. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. టీడీపీ ఉమ్మడిగా తిని, ఒంటరిగా బలవాలనుకుంటోందని అది మున్ముందు జరగదన్నారు. ముఖ్యంగా, 'జనసేన' సైనికుల వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని అన్నారు.
తాను బస చేసే ప్రాంతంలో కరెంట్ కట్ చేయించి, తనపై దాడులకు యత్నిస్తున్నారని ఆరోపించిన పవన్, అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని అన్నారు. అలాగే, ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు అవుతుంటాయనీ, అధికారం ఏ ఒక్కరి సొత్తూ కాదనీ, అది ప్రజల సొత్తు అని పవన్ అన్నారు.
ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకివ్వదంటూ కేంద్రం తీరును ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు నిలబెట్టుకోవాలని, హామీలు నెరవేర్చకుంటే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని, నాలుగేళ్లలో 36 సార్లు మాటమార్చాని, ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నామని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధనకు సంబంధించి 'ఇక మాటలు లేవు.. చేతలే' అని హెచ్చరించారు.