Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

సెల్వి

శుక్రవారం, 20 డిశెంబరు 2024 (17:16 IST)
Pawan kalyan
మన్యం, పార్వతీపురం జిల్లాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. గిరిజన ప్రాంతాల్లో డోలీలకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం రహదారుల నిర్మించనుంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన పవన్ కల్యాణ్ రోడ్ల నిర్మాణానికి మక్కువ మండలం బాగుజోలు నుంచి శ్రీకారం చూట్టారు. 
 
ఈ రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి లభించనుంది. దాదాపు 36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ మేర నూతన రోడ్ల నిర్మాణం జరగునుంది. 

నీ అభిమానిని అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను అన్న???? @PawanKalyan ????????.. నువ్వు చేసే మంచి పనులను చూస్తుంటే నీ కోసం ఇంకా ఇంకా ఎక్కువ కష్టపడాలి అని ప్రతి ఒక్క జనసైనికుడు మరియు వీరమహిళలు భావిస్తున్నారు.. జై జనసేన,జై హింద్ ✊✊..జై పవన్ కల్యాణ్.. pic.twitter.com/LCZG25CCQA

— satish pawan (@satishpawan143) December 20, 2024
దశాబ్దాల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు సమస్యలకు ఇక ముగియనున్నాయి. మాల్లో సరైన రోడ్లు లేక గత 3 ఏళ్లలో దాదాపు 21 డోలి మోతలు జరిగాయి.  అయితే ఈ రహదారుల నిర్మాణంతో డోలీ కష్టాలకు ప్రభుత్వం ముగింపు పలకనుంది. 

మన్యం ప్రజలు : అన్నా మీకు గుడి కడతాం

Pawan kalyan : మనకు కావాల్సింది గుడి కాదు, మీ పిల్లల చదువుకోసం "బడి" కావాలి. @PawanKalyan !! @JanaSenaParty pic.twitter.com/bQTxtgUz1V

— Sreekanth B+ve (@sreekanth324) December 20, 2024
బాగుజోలు - సిరివరం రహదారికి రూ.9 కోట్ల అంచనాతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. రహదారి నిర్మాణానికి పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాపన చేశారు. మొత్తం రెండు జిల్లాల వ్యాప్తంగా నేడు పవన్ 19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు జరగనున్నాయి. 
 

కేవలం కాన్వాయ్ అయినా వీడియో తీసుకుందాం ఆనుకుని అక్కడ నుంచున్నారు..
తీరా చూస్తే జన్మ ధన్యం అయ్యే అవకాశం ఇచ్చాడు..
Unpredictable @PawanKalyan ????#ApGovtForTribalWelfare #PawanKalyanAneNenu https://t.co/advGNkTorC

— Twood Trolls ™ (@TT_2_0) December 20, 2024
అనారోగ్యం బారిన పడిన వృద్ధులను, గర్భిణీ స్త్రీలను డోలీల్లో కట్టుకుని వాగులు దాటే దయనీయ పరిస్థితుల నుండి విముక్తి కలిగించేలా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 49.73 కోట్ల రూపాయలతో 9 గిరిజన ప్రాంతాల్లో 48 కి.మీ.ల మేర రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. 
 
ఈ సందర్భంగా మన్యంలో పవన్ మాట్లాడుతూ.. మనకు కావాల్సింది గుడి కాదు, మీ పిల్లల చదువుకోసం "బడి" కావాలి.. అన్నారు. తనకు గుడి కట్టడం సరికాదన్నారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. 

Senani @PawanKalyan arrives barefoot to a Tanda which doesn’t even have mud road access! ???? pic.twitter.com/LLr92jOb4s

— ???? ???? ???? ???? ???? ???????? (@LetsGlassIt) December 20, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు