వైకాపా నేతల ఆదాయం 3 రెట్లు పెరిగితే - ఉద్యోగుల వేతనం 30 శాతం తగ్గింది.. పవన్

శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (07:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గురువారం నిర్వహించి ఛలో విజయవాడ కార్యక్రమంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆదాయం మూడు రెట్లు పెరిగినా.. ఉద్యోగుల వేతనం మాత్రం 30 శాతం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, ఒక ప్రభుత్వ ఉద్యోగి బిడ్డగా ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఏపీలో చలో విజయవాడ నిరసనపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఏమాత్రం సబబుగా లేదన్నారు. ఉద్యోగులను నిలువునా మోసం చేసిందన్నారు. ఉద్యోగ సంఘాల నేతలో జరిగిన చర్చలను రాష్ట్ర ప్రభుత్వం సమస్యను సీరియస్‌గా తీసుకోలేదన్నారు. 
 
ఉద్యోగుల సమస్యలను సముచితమైన రీతిలో పరిష్కరించడంలో విఫలమైందన్నారు. తాను కూడా ప్రభుత్వ ఉద్యోగి కుమారుడని, ప్రతి ఉద్యోగి తన కుటుంబం కోసం టీఏలు, డీఏలు, పీఆర్‌సీ ఇంక్రిమెంట్‌లను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల ఇన్‌పుట్ ప్రకారం, హెచ్‌ఆర్‌ఎను ఎనిమిది నుండి రెండు శ్లాబ్‌లకు తగ్గించడం ద్వారా, దాని వల్ల రూ.5,000 నుండి రూ.8,000 వరకు వేతనం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు