వాలంటీర్లను గత వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది: పవన్ కల్యాణ్

సెల్వి

గురువారం, 7 నవంబరు 2024 (18:30 IST)
Pawan kalyan
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు విప్పారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు.. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.. ఇదో సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు. 
 
ఎన్నికల ప్రచార సమయంలో వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలూ ఆరోపించారు. వారి వాదనకు బలం చేకూర్చుతూ.. కొంతమంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ వైసీపీకి తరపున ప్రచారం చేశారు. 
 
ఐతే.. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారనీ, తాముగా అలా చెయ్యలేదని అన్నారు. అయితే అమరావతిలో జరిగిన సర్పంచ్ సంఘాల సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ స్పందించారు. 
 
వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచులు కోరగా.. అందుకు పవన్ ఒప్పుకోలేదు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఉంది అన్నారు. తద్వారా వాలంటీర్లకు ప్రభుత్వం ఇప్పటికీ అనుకూలంగానే ఉంది అనే సంకేతం ఇచ్చారు.
 
వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని గ్రామ సర్పంచి పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్​పై స్పందించారు. సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీ పరిధిలోకి తెచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు