పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల్లోనూ పవన్ పార్టీ జనసేన పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పవన్ పాట పాడేందుకు ఓ టీవీ ఛానల్ కావాల్సిన అవసరముంది. ఇందుకోసం పవన్ కల్యాణ్.. టీవీ9 రవి ప్రకాష్‌తో సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ లేటెస్టు మూవీ కాటమరాయుడు ఫంక్షన్‌లో బండ్లగణేష్‌తో పాటు టీవీ9 రవి స్పీచ్ కూడా హైలైట్ అయ్యింది.
అయితే రవిప్రకాష్ ఈ ప్రోగ్రామ్‌కు ఎందుకొచ్చారు. పవన్‌ని ఆయన ఎందుకు అంతలా పొగిడేశారు అనే దానిపై చర్చసాగుతోంది. ఈ సినిమాకు మీడియా భాగస్వాములుగా వచ్చారనుకున్నప్పటికీ.. వీరిద్దరూ ప్రత్యేకంగా పవన్‌తో భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒక కొత్త ఛానల్‌ని పవన్ ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.