నందమూరి తారక రామారావు టిటిడిని ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా చేయాలని ఆలోచన చేశారని..ఒక మతానికి సంబంధించిన దేవాలయంను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఖచ్చితంగా మతంలో ప్రభుత్వ జోక్యం అనేది అనవసరమని, మతానికి సంబంధించిన వ్యవస్ధల పనితీరును సమీక్ష చేసుకోవడానికి మార్గదర్సకాలు ఇవ్వాలన్నారు.
మతం మీద పెత్తనానికో, మతంలో జోక్యానికో ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం సరైన చర్య కాదన్నారు. సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా అనేక దాడులను ఎదుర్కొంటూ స్వతంత్రంగా సజీవంగా నిలబడిందని... టిటిడిపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆధీనంలో ఉండాలనే ఆలోచనను పిఎసి ఛైర్మన్ గాను, స్వామి భక్తుడిగాను విభేదిస్తున్నానన్నారు.