సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ, ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. ప్రాణ త్యాగానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆరోపణలు నిరూపిస్తే ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఉరేసుకుంటానన్నారు.
పైగా, మంచిర్యాలకు చెందిన బోయిని సంధ్య, బోయిని విజేతలు అక్కాచెల్లెళ్లని వివరించారు. సంధ్య తనను మోసం చేయాలని ఆరు నెలల క్రితమే ప్లాన్ చేసిందని చెప్పారు. తాను భార్య, కుమారుడితో కలిసి దిగిన ఫొటోలో తన భార్య స్థానంలో సంధ్య ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసిందని సుమన్ ఆరోపించారు.
మరోవైపు సుమన్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని మంచిర్యాల సీఐ మహేశ్ తెలిపారు. బాధితులుగా చెబుతున్న సంధ్య, విజేతలు చూపిస్తున్న ఆధారాల్లో నిజం లేదన్నారు. ఫొటోను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినట్టు విచారణలో తేలిందని సీఐ పేర్కొన్నారు.