విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుడిలో ఉన్న శిరిడీ సాయిబాబా విగ్రహానికి వైసీపీ జెండాను కట్టారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూజారులు స్పందిస్తూ, మరుసటి రోజే జెండాను తొలగించామని చెప్పారు. ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ గడ్డపై ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
నిజానికి నవ్యాంధ్రలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ వైకాపా రంగులు వేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ జెండాకు, గాంధీ విగ్రహం దిమ్మెకు.... ఇలా అదీ, ఇదీ అనే తేడా లేకుండా రంగులు పూసేస్తున్నారు. తాజాగా సాయిబాబా విగ్రహానికి కూడా వైకాపా జెండా కప్పేశారు. అయితే, వీరి తీర్పు విపక్ష నేతలు ఎన్నో రకాలైన విమర్శలు గుప్పిస్తున్నా వైకాపా కేడర్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.