సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10వేలు, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారికి రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.
రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5వేల జరిమానా విధించనున్నట్లు తెలిపింది.
అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ.వెయ్యి, రెండోసారి రూ.2 వేలు జరిమానా విధిస్తామని తెలిపింది. వేగంగా వాహనం నడిపితే రూ. వెయ్యి జరిమానా వేస్తామని స్పష్టం చేసింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వులపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.