ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. దాంతో శభాష్ సజ్జనార్, దటీజ్ సజ్జనార్, సాహో సజ్జనార్... అంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తున్నాయి.
కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న స్వప్నిక, ఆమె స్నేహితురాలు ప్రణీతపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్‌తో దాడి చేశాడు. అతడికి మరో ఇద్దరు సహకరించారు. 2008 డిసెంబరు 10న జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు నిందితులనూ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. దీని వెనక కూడా సజ్జనారే ఉన్నారు. అప్పుడు వరంగల్ జిల్లా ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు.