అయితే ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)లో మార్పులు చేస్తూ ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.