పవన్ గెలిస్తే ఊరంతా నా భర్త రిక్షా తొక్కిన డబ్బులతో పార్టీ ఇస్తా.. రిక్షా వాలా భార్య

సెల్వి

మంగళవారం, 14 మే 2024 (12:11 IST)
Pawan kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌పై పిఠాపురంలో ఓ అభిమాని తన అభిమానిని చాటుకుంది. ఓ రిక్షావాలా భార్య ‌పవన్ కళ్యాణ్‌పై తనకు ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకుంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే.. ఊరంతా నా భర్త రిక్షా తొక్కిన డబ్బులతో పార్టీ ఇస్తానని ఆమె ప్రకటించింది. 
 
తన భర్త రిక్షా తొక్కినా తక్కువ డబ్బులు వస్తాయని.. అయినా సరే పార్టీ ఇవ్వడం మాత్రం ఖాయమని చెప్పింది. అలాగే తన భార్య మాట ఇచ్చి ప్రకారం పార్టీ ఇవ్వడం ఖాయమని.. తమకు ఉన్న స్థోమతలోనే మంచి పార్టీ ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే రిక్షా తాకట్టు పెడతామంటూ తేల్చి చెప్పారు భార్యాభర్తలు..  ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
 
పవన్ కళ్యాణ‌పై ఆ మహిళా అభిమాని చూపించిన ప్రేమతో టాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆమె పవన్‌పై చూపిస్తున్న అభిమానానికి తాను ఫిదా అయ్యానన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవగానే తాను కచ్చితంగా ఆ మహిళ భర్తకు ఆటోను గిఫ్ట్‌గా ఇస్తానని ప్రకటించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు