పిఠాపురం: పవన్ కోసం వదినమ్మ.. బాబాయ్ కోసం చెర్రీ..

సెల్వి

శనివారం, 11 మే 2024 (17:15 IST)
Ram Charan
జనసేనాని పవన్ కల్యాణ్‌కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వచ్చారు. మేనమామ అల్లు అరవింద్, తల్లి సురేఖలతో కలిసి హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న రామ్ చరణ్... అక్కడ్నించి రోడ్డు మార్గం ద్వారా పిఠాపురం చేరుకున్నారు.
 
పిఠాపురంలో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. చేబ్రోలులోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన రామ్ చరణ్... అక్కడ బాబాయితో కలిసి పిఠాపురం ప్రజలకు అభివాదం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇక మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ వంటి వారంతా డైరెక్ట్‌గా కొందరు, సోషల్ మీడియా వేదికగా మరికొందరు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
 
శనివారం పిఠాపురానికి రామ్ చరణ్ తన మదర్ సురేఖ, మామ అల్లు అరవింద్‌‌తో కలిసి వెళ్లారు. అక్కడ ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం.. తన బాబాయ్‌ని భారీ మెజారీటీని గెలిపించాలని రామ్ చరణ్ పిఠాపురం ప్రజలను కోరారు.

పిఠాపురంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు !!#PawanKalyanWinningPithapuram #VoteForGlass #Pithapuram #PawanKalyan pic.twitter.com/SMIkaMhBva

— JanaSena Pithapuram (@pithapuramjsp) May 11, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు