నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

ఠాగూర్

శనివారం, 3 మే 2025 (15:01 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం కోసం శుక్రవారం అమరావతికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ల మధ్య సరదా సంభాషణ జరిగింది. సభా వేదికపై ప్రధాని మోడీతో కరచాలనం చేస్తున్న సమయంలో మంత్రి లోకేశ్‌తో సరదా వ్యాఖ్యలు చేశారు. నీకెన్ని సార్లు చెప్పాలి.. నన్ను కలవడానికి ఢిల్లీకి రావా? అని లోకేశ్‌తో అన్నారు. గత పర్యటన సమయంలోనూ ఇదే అంశాన్ని మంత్రి లోకేశ్‌తో ప్రధాని అన్నారు. అయితే, ఇందుకు బదులిచ్చిన మంత్రి నారా లోకేశ్... త్వరలోనే కుటుంబ సమేతంగా ఢిల్లీకి వస్తారని ప్రధాని మోడీకి మాటిచ్చారు. 
 
అలాగే, సభా వేదికపై మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో ప్రసంగించే సమయంలో దగ్గు వచ్చింది. ఆ తర్వాత తన ప్రసంగం ముగించుని తన స్థానానికి వెళ్లారు. పిమ్మట ప్రధాని మోడీ.. పవన్‌ను పిలిచి చాక్లెట్ అందజేశారు. దీంతో ప్రధానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో వైరల్ అయిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు