పవన్ కళ్యాణ్‌కు బహుమతి ఇచ్చిన ప్రధాని మోడీ (Video)

ఠాగూర్

శుక్రవారం, 2 మే 2025 (18:00 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బహుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సంఘటనతో సభావేదికపై కూర్చొన్న వారంతా కడుపుబ్బ నవ్వుకున్నారు. అమరావతి పునర్‌నిర్మాణ పనుల ప్రారంభోత్సవం శుక్రవారం అమరావతిలో జరిగింది. 
 
ఈ పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొని పనును బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా సభా వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముఖ్య నేతలందరూ సభా వేదికపై ఆశీనులై ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తన వద్దకు పిలించారు. ప్రధాని ఎందుకు పిలిచారోనని పవన్ హడావుడిగా ఆయన వద్దకు వచ్చారు. 
 
అపుడు మోడీ తన వద్ద ఉన్న చాక్లెట్‌ను పవన్‌కు ఇవ్వడంతో వేదికపై నవ్వులు విరబూశాయి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు నవ్వడంతో, పవన్‌ కూడా చేతిలో ఉన్న చాక్లెట్‌ను చూసుకుని వారితో కలిసి తాను కూడా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని మోడీ pic.twitter.com/CGPqLaTcJA

— Telugu Scribe (@TeluguScribe) May 2, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు