తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటున్నారు. ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు హైదరాబాద్ నగరంలోని దిండిగల్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి విమానంలో బయల్దేరి 6.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి రాత్రి 7.45 గంటలకు తిరుమల చేరుకుంటారు. కొండపై రచన అతిథి గృహంలో రాత్రికి బస చేస్తారు. సోమవారం ఉదయం 7.50 గంటలకు అతిథి గృహం నుంచి బయల్దేరి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు.
ప్రధాని రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, తిరుమలలో బస, వాహనాల కాన్వాయ్ తదితర ఏర్పాట్లలో తలమునకలైంది. కాగా, ప్రధానిరాక సందర్భంగా ఆయనను విమానాశ్రయంలో స్వాగతించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ రానున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా దీనిపై జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సమాచారం లేనప్పటికీ స్వాగతించడం నుంచి తిరిగి వీడ్కోలు పలికే దాకా ప్రధాని వెంటే ఆయన ఉండే అవకాశముందని వైసీపీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.