వీ6 తెలంగాణకు వ్యతిరేకమని.. అందుకే బిత్తిరి సత్తిపై దాడి చేసేందుకు వచ్చానన్నాడు. సదరు ఛానెల్ అంతుచూసేందుకు వచ్చానన్నాడు. తెలంగాణ గురించి, దేశం గురించి వీ6 చెడుగా ప్రచారం చేస్తుందన్నాడు. పోలీసులు అతనో ఉన్మాదిలా వున్నాడని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో బిత్తిరి సత్తిపై మణికంఠ అనే వ్యక్తి దాడికి పాల్పడిన నేపథ్యంలో అతనికి చికిత్స అందించిన స్టార్ ఆసుపత్రి వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. బిత్తిరి సత్తి ముఖం, చెవులకు గాయాలయ్యాయని చెప్పారు. బిత్తిరి సత్తిపై దాడిని కాంగ్రెస్‌నేత పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. ఈ దాడిని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ కూడా ఖండించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.