మొత్తం 7 కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామని.. ఎంసెట్‌లో సుమారు 2,72,720 మంది నమోదు చేసుకున్నారని మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ ఎంసెట్ పరీక్షను 118 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం. ఎగ్జామ్ ముందు, తర్వాత కూడా హాల్‌ను శానిటైజ్ చేస్తాం. ప్రతి సెంటర్‌లో ఇసోలేషన్ రూమ్‌లు అందుబాటులో ఉంచాం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీసీఎస్, ఏపీ ఆన్‌లైన్ సంయుక్తంగా ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం.