ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:13 IST)
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణ తేదీల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు.

సెప్టెంబర్‌ 10, 11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌, 28, 29, 30 తేదీల్లో ఎపి పిఇసెట్‌, అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, 2న లాసెట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు