కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న అత్యాధునిక డ్రోన్ కెమేరా, బాడీ వార్న్ కెమేరా, ఫల్‌కాన్ వాహనాల ద్వారా నగరాన్ని డేగకన్నుతో పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి సంఘటన జరిగినా వెంటనే పసిగట్టి, సమాచారాన్ని అధికారులకు అందించడం ద్వారా ముందుగానే ఆ సమస్యను తెలుసుకొని నియంత్రించడం జరుగుతుంది.
ఈ క్రమంలో శుక్రవారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విజయవాడ సిటీ పోలీసులు తరఫున కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ప్రతిష్టాత్మక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ టెక్ సభ అవార్డును నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, అడ్మిన్ డిసిపి మేరీ ప్రశాంతి అందుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ... ఈ అవార్డు రావడం విజయవాడ నగర పోలీసులకు గర్వకారణమన్నారు. దీంతో తమ బాధ్యతను మరింత పెంచిందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అనునిత్యం కృషి చేయడం జరుగుతుందన్నారు.