మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన పూజారికి పదేళ్ల జైలు శిక్ష పడింది. 2014లో 11 ఏళ్ల మైనర్ బాలికపై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసుపై జరిగిన విచారణలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు అతనికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పూజల కోసం తరచూ మైనర్ బాలిక ఇంటికి వెళ్లే పూజారి.. అలా ఓసారి యాగం నిర్వహించేందుకు వెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక ఒంటరిగా ఉండటంతో పూజారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్నిబాలిక తల్లిదండ్రులతో చెప్పింది. దీంతో ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అప్పటినుంచి విచారణ జరుగుతూ వస్తున్న ఈ కేసులో నాంపల్లి కోర్టు గురువారం తుది తీర్పు వెల్లడించింది. పూజారిని దోషిగా తేలుస్తూ పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3వేలు జరిమానా విధించింది.