అక్కడ ధూమపానం చేయాలంటే వందేళ్లు నిండాల్సిందే....

గురువారం, 7 ఫిబ్రవరి 2019 (11:47 IST)
ధూమపానాన్ని అరికట్టడానికి పలు దేశాలు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ రకాలైన ఆంక్షలు విధిస్తున్నాయి. మన భారతదేశంలో లాగానే చాలా దేశాలలో ధూమపానం చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. కానీ అమెరికాలోని హవాయి వంటి రాష్ట్రాలలో సిగరెట్ తాగాలంటే కనీస వయస్సు 21 ఉండాలి. కానీ ధూమపానాన్ని శాశ్వతంగా నిరోధించాలనే ఉద్దేశంతో మరో అడుగు ముందుకు వేశారు. 
 
ఇందులోభాగంగా ఆ ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురాబోతోంది. వంద ఏళ్లు పైబడిన వారు మాత్రమే ధూమపానం చేయడానికి అర్హులు. దీనికి సంబంధించిన బిల్లును అక్కడి చట్ట సభ సభ్యుడు రీచర్డ్‌ క్రీగన్‌ ప్రవేశపెట్టారు. కానీ అమలు చేయనున్న చట్టం ఆధారంగా కనీస వయస్సుని ఒకేసారి 100 ఏళ్లకు పెంచకుండా వచ్చే ఏడాది 30 సంవత్సరాలు, 2021లో 40 ఏళ్లకు, 2024లో వందేళ్లకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లును ప్రవేశపెట్టామని క్రీగన్‌ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు