సిగరెట్లు కాల్చవద్దని ప్రభుత్వాలు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా ఎవరూ వాటిని పట్టించుకోరు. పైగా ప్రతి ఏడాది వాటి ధరలు పెంచినా కూడా విక్రయాలు కూడా బాగా పెరుగుతూనే ఉంటాయి. మన దేశంలో పొగ త్రాగడానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస వయస్సు 18 ఏళ్లు, చాలా దేశాల్లో కూడా ఇదే వయసు నుండి పొగ త్రాగడానికి అనుమతిస్తారు.
ఈ బిల్లు ప్రకారం చట్టరీత్యా సిగరెట్ త్రాగే వారి వయస్సు వచ్చే ఏడాదిలో 30 ఏళ్లకు, 2021లో 40 ఏళ్లకు, 2022లో 50 ఏళ్లకు, 2023లో 60 ఏళ్లకు చివరగా 2024లో 100 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే హవాయిలో సిగరెట్ అమ్మకాలపై కఠిన నిబంధనలు ఉన్నాయని, అయినా కూడా విడతల వారీగా తమ దేశం నుంచి సిగరెట్‌ను పూర్తిగా తరిమివేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు క్రెగన్ తెలిపారు.