ఏపీ ఎన్నికలు.. స్వస్థలాలకు జనం.. హైదరాబాద్‌- విజయవాడ హైవేపై రద్దీ

సెల్వి

శనివారం, 11 మే 2024 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సోమవారం జరుగనుంది. ఇందుకోసం హైదరాబాదులో ఉద్యోగులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
 
శనివారంతో ప్రచారం ముగియనుండగా, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. 
 
ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో కదలి వెళ్తున్నారు. సొంత వాహనాల్లో వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉండడంతో హైదరాబాద్‌- విజయవాడ హైవేపై ఒక్కసారిగా భారీ రద్దీ పెరిగిపోయింది. 
 
హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో హయత్‌నగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు