ఆంధ్రలోని 115 చెంచు గిరిజన కుటుంబాలకు సాధికారత: హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ ఆగ్రోఫారెస్ట్రీ కార్యక్రమం

ఐవీఆర్

సోమవారం, 12 మే 2025 (16:03 IST)
నంద్యాల: హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) యొక్క సీఎస్ఆర్ విభాగం అయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్), తమ హ్యుందాయ్ యోనిక్ ఐయోనిక్(IONIQ) ఫారెస్ట్ కార్యక్రమం ద్వారా నంద్యాల జిల్లాలోని 115 చెంచు గిరిజన కుటుంబాలను జీవనాధార వ్యవసాయం నుండి స్థిరమైన ఆగ్రో ఫారెస్ట్రీకి మార్చడం ద్వారా సాధికారత కల్పించింది. అక్టోబర్ 2022లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం, పర్యావరణ అనుకూల రీతిలో భూసార పరిరక్షణకు వనములను పెంపకాన్ని ప్రోత్సహించడానికి, భూమి, నీటి నిర్వహణ, సామర్థ్య నిర్మాణ ప్రయత్నాలను మిళితం చేయటం ద్వారా నంద్యాల జిల్లాలోని చెంచు లక్ష్మీగూడెం, నరపురెడ్డి కుంట, బైర్లూటీ, నాగలూటీ గ్రామాలలో విస్తరించి ఉన్న చెంచు కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరిచింది.
 
మొదటి దశలో, బోర్ బావులు, బిందు సేద్యం వ్యవస్థలు వంటి ఖచ్చితమైన నీటిపారుదల మౌలిక సదుపాయాలతో ఉద్యానవన తోటల ద్వారా దీర్ఘకాలిక ఆదాయ ఉత్పత్తి కోసం మొత్తం 250 ఎకరాల భూమిని అభివృద్ధి చేశారు. ఇది నీటి సామర్థ్యం, భూసార మెరుగుదల, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను మెరుగుపరిచింది, అటవీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించింది, పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించింది. అంతర పంటలతో సహా వైవిధ్యభరితమైన వ్యవసాయ అటవీ పద్ధతులు కుటుంబాల ఆదాయాన్ని పెంచాయి, గత రెండు సంవత్సరాలలో నాలుగు గ్రామాలలో రూ.  24.56 లక్షలు సంపాదించాయి. అదనంగా, ఈ ప్రాజెక్ట్ ఉద్యానవన శాఖ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ [ఐటిడిఏ], మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి పథకాలతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నుండి రూ. 75.53 లక్షలను ఉపయోగించుకుంది, ఈ సమాజాలలో ఆహార భద్రత, స్వావలంబనను మరింత బలోపేతం చేసింది.
 
నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని 20 గ్రామాలలోని గిరిజన, వెనుకబడిన కుటుంబాలకు పర్యావరణం, స్థిరమైన జీవనోపాధిని విస్తరించడానికి దాని వ్యవసాయ అటవీ కార్యక్రమం యొక్క రెండవ దశ- హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ ఈరోజు ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో, ఆత్మకూర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్-సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ శ్రీమతి డి. నాగజ్యోతి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఐటిడిఏ) అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఎ. సురేష్ కుమార్, HMIF అధికారులు ప్రాజెక్ట్ నేమ్ బోర్డును ఆవిష్కరించి, లబ్ధిదారులకు మొక్కలను అందజేశారు. బిఏఐఎఫ్ NGO వైస్ ప్రెసిడెంట్ మరియు రీజినల్ డైరెక్టర్ - సౌత్, హార్టికల్చర్ (ఐటిడిఏ) అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ పి.సి. ధనంజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ఈ రెండవ దశలో, హెచ్ఎంఐఎఫ్ లబ్ధిదారులకు భూమి చదును చేయడం, గుంతలు తవ్వడం, మొక్కల సరఫరా, కంచె వేయడం, ఎక్స్‌పోజర్ సందర్శనలు, అంతర పంటలు, పంట నిర్వహణ వంటి స్థిరమైన వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడంలో మద్దతు ఇస్తుంది. అదనంగా, రైతులు సేంద్రీయ ఎరువు, యాంత్రికంగా దుక్కి దున్నడం, దున్నడానికి మద్దతు పొందుతారు. మొత్తం రూ. 5.3 కోట్ల నిధులతో, ఈ ప్రాజెక్ట్ 290 మంది రైతుల యాజమాన్యంలోని 600 ఎకరాల భూమిని సమిష్టిగా సాగు చేయడానికి సహాయపడుతుంది, వారికి స్వావలంబన కల్పిస్తుంది.
 
 'హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్' ప్రాజెక్ట్ యొక్క రెండవ దశ ప్రారంభం గురించి హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీ గోపాలకృష్ణన్ సి ఎస్ మాట్లాడుతూ, "హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ పర్యావరణ పరిరక్షణ, సమాజ సాధికారత పట్ల మా నిబద్ధతకు నిదర్శనం. భూసార పరిరక్షణ కార్యకలాపాలను  జీవనోపాధి మద్దతుతో అనుసంధానించడం ద్వారా, గిరిజన, అణగారిన కుటుంబాలు స్వావలంబన సాధించడానికి మేము మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ తరహా కార్యక్రమాల ద్వారా, మేము పర్యావరణ అనుకూల  పురోగతి , అర్థవంతమైన మార్పును కొనసాగిస్తున్నాము, హ్యుందాయ్ యొక్క 'మానవత్వానికి పురోగతి' అనే ప్రపంచ లక్ష్యంను బలోపేతం చేస్తున్నాము " అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు