హిందూపురం అన్నా క్యాంటీన్‌లో వ్యభిచారం

ఆదివారం, 13 జనవరి 2019 (09:45 IST)
అది టీడీపీ నేత, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. అక్కడ తెలుగుదేశం పార్టీ తొలి ప్రాధాన్యతగా అన్నా క్యాంటీన్‌ను ఏర్పాటుచేసింది. కానీ, ఈ క్యాంటీన్‌లో వ్యభిచారం గుట్టుచప్పుడుకాకుండా, మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతోంది. ఈ వ్యభిచార బాగోతం తాజాగా బట్టబయలైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అనంతపురం జిల్లాలోని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేశారు. ఈ క్యాంటీన్‌లో ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు జోరుగా వ్యాపారం సాగుతోంది. ఆ తర్వాతే అసలు బాగోతం సాగుతోంది. ఈ క్యాంటీన్‌లో రాత్రివేళల్లో వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వాచ్‌మెన్‌ జయరాం ఓ మహిళతో రాసలీలలు జరుపుతుండగా స్థానికులు పట్టుకున్నారు. 
 
అనంతరం మీడియాకు సమాచారమిచ్చారు. అన్నా క్యాంటీన్‌ మేనేజర్‌ కృష్ణా, వాచ్‌మెన్‌ జయరాంలను మీడియా ప్రతినిధులు నిలదీయటంతో వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వటం పలు అనుమానాలకు తావిస్తోంది. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చినా కనీసం విచారించకుండానే అందర్నీ వదిలేయటం చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు