అయితే రాగతి పండరి అవయవాలను సావిత్రిబాయి పూలే మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. మహిళలు చాలా తక్కువ సంఖ్యలో వున్న కార్టూన్ రంగంలో రాగతి పండరి గుర్తింపు పొందారు. అనేక పత్రికల్లో రాగతి కార్టూన్లు అచ్చయ్యాయి. వ్యంగ్యంగా కార్టూన్లు గీయడంతో రాగతి దిట్ట. దురాచారాల్ని ప్రశ్నిస్తూ.. హాస్యం మేళవిస్తూ కార్టూన్లు గీసిన గీత ఆగిపోయింది.