Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

దేవీ

సోమవారం, 14 జులై 2025 (14:18 IST)
Vishal, Dushara Vijayan
తమిళ, తెలుగు నటుడు విశాల్ ‘మధ గజ రాజా’ చిత్రం విజయం తర్వాత విశాల్ ఇప్పుడు తన 35వ చిత్రాన్ని ప్రారంభించారు. నిర్మాత RB చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.  RB చౌదరి 1990లో ‘పుదు వసంతం’ చిత్రంతో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌ను ప్రారంభించారు. అప్పటి నుండి ఈ బ్యానర్ అనేక విజయవంతమైన చిత్రాలను అందించింది. తమిళ, తెలుగు సినిమాకు అనేక మంది కొత్త దర్శకులను పరిచయం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రస్తుతం విశాల్‌‌తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌కి 99వ చిత్రం.
 
Vishal, Dushara Vijayan, Karthi, Jeeva, RB Chowdhury, Ravi Arasu
ఈ కొత్త చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. నటి దుషార విజయన్ విశాల్ సరసన కథానాయికగా నటించనున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. నటుడు విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో ఇది మొదటి చిత్రం. ముఖ్యంగా ‘మధ గజ రాజా’ చిత్రం ఘన విజయం తర్వాత విశాల్ మరోసారి సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్‌తో చేస్తున్నారు. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేయనున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మార్క్ ఆంటోనీ విజయం తర్వాత సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ మరోసారి ఈ చిత్రానికి విశాల్‌తో కలిసి పనిచేస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు (జూలై 14) ఉదయం చెన్నైలో అట్టహాసంగా జరిగింది. దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య (సిటిజన్), మణిమారన్ (NH4), వెంకట్ మోహన్ (అయోగ్య), శరవణన్ (ఎంగేయుమ్ ఎప్పోదుం), నటులు కార్తీ, జీవా, డిఓపి ఆర్థర్ ఎ విల్సన్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. చెన్నైలో చిత్రీకరణ ప్రారంభించి 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. మిగిలిన వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
 తారాగణం : విశాల్, దుషార విజయన్, తంబి రామయ్య, అర్జై తదితరులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు