సీఎం జగన్‌తో నాది వన్‌సైడ్ లవ్... నేను ప్రేమిస్తూనే వుంటా.. ఆర్ఆర్ఆర్

గురువారం, 17 సెప్టెంబరు 2020 (13:41 IST)
వైకాపా అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజు తనదైనశైలిలో సెటైర్లు వేయడం మంచి నేర్పరి. అయితే, నిజాన్ని నిర్భయంగా మాట్లాడేస్తారు. అందుకే వైకాపా నేతలతో విభేదాలు వచ్చాయి. ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. అయినప్పటికీ ఆయన పార్టీని వీడలేదు. అధైర్యపడలేదు. తన మనసులోని మాటలను అపుడపుడూ నిర్భయంగా మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. 
 
తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ వెలుపల గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికైన కొత్తలో ఎంపీలతో సీఎం జగన్ సమావేశమైనప్పటి సంగతులను చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు పార్టీ అధినేత, సీఎం జగన్ పట్ల ఉన్న విధేయత, ప్రేమను వ్యక్తం చేశారు. మీది నాది వన్ సైడ్ లవ్... మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను... మీరు ప్రేమించడం లేదు. అంతే. మీరు ప్రేమించకపోతే ఇంకొకరిని చూసుకుంటాను అంటూ తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, కానీ నిజజీవితంలో నటించేవాళ్లను నమ్మకండి అంటూ జగన్‌కు సలహా ఇచ్చారు. ఎవరైనా పొగడ్తలకు పడిపోతారు. మహానటులు మీ చుట్టూ ఉన్నారు. కానీ వారు చెప్పేవి నిజం అనుకోకండి. నిజం ఎప్పుడూ నిష్టూరంగా ఉంటుంది. నేను మాట్లాడుతున్నట్టు. మిమ్మల్ని కలిసే అర్హత కోల్పోయానని నిన్న ఒకరు అన్నారు. దిగులు పడటం లేదు. మిమ్మల్ని కలవడం లేదని ఆ శివాజీ గణేశ్‌లా ఏడవనండి అంటూ ఆర్ఆర్ఆర్ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు