దీనిపై స్పందించిన రఘురామ రాజు... దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్బాజీ ట్వీట్‌గా దాన్ని అభివర్ణించారు. ప్రత్యర్థిని అయినా గౌరవించాలని రామాయణం చెబుతోందని, చిన్నప్పటి నుంచి అలాంటి గ్రంథాలు చదువుకుంటే మర్యాద లక్షణాలు వచ్చేవేమో అని వ్యాఖ్యానించారు.
నిన్న మీరు చేసిన దరిద్ర ట్వీట్ వలన పార్టీ పరువు పోయింది. పార్టీ ఇమేజ్ పోయింది. జాతీయ కార్యదర్శివి, రాజ్యసభలో సభ్యుడివి... మా అందరికీ పార్లమెంటులో నాయకుడివి. అసలు బుద్ధుందా... అలా మాట్లాడతాడేంటి... ఇదా సంస్కారం అని మండిపడ్డారు.
సీఎం... నేను విష్ చేశాం కదా. తప్పు సాయి రెడ్డి గారు... మీ సంకుచిత స్వభావాన్ని చూపకండి. ఇలా చెత్త మాట్లాడితే మీకేదో గండపెండేరం తొడుగుతాడని అనుకుంటున్నారేమో... ఇతరులను మీరు గౌరవిస్తే... సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. మీ దిక్కుమాలిన పోస్టులును సోషల్ మీడియాలో తప్ప... సంస్కారం ఉన్నవాళ్లు ఎవరూ లైక్ చేయరు. దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్బాజీ ట్వీట్ల వల్ల తటస్థంగా ఉన్న 15 శాతం ఓటింగ్ పోతుంది.