తెలుగు ప్రజలకు శుభవార్త. రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్- తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. వర్షానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడిందని పేర్కొంటూ, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుంచి వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్, తాండూర్, మెదక్, మేడ్చల్, జగిత్యాల వంటి ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా.