పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధి కృష్ణరాయపురంలో దారుణమైన ఘటన నగరవ్యాప్తంగా సంచలనం రేపింది. కృష్ణరాయపురంలో నివాసం ఉంటున్న కె.నాగేశ్వరరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నకుమార్తె తనూజ (14) పురుషోత్తపురంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ ఇంటి నుంచి పాఠశాలకు నడుచుకుని వెళ్లివస్తుంది.
అయితే అదే అపార్ట్‌మెంట్ వద్ద ఆమె స్నేహితురాలు ఉంటున్న ఫ్లాట్‌కి కింద ఉన్న గోడకు ఆనుకుని తనూజ మృతదేహం ఆదివారం ఉదయం కనిపించింది. దీంతో స్థానికులు తనూజ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి దిలీప్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యువకుడి తల్లిదండ్రులను కూడా ప్రశ్నిస్తున్నారు.