కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రేషన్‌ను ఈ నెల 29నే ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనుంది.
ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు..
- ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన బియ్యం, ఒక కేజీ కందిపప్పును కార్డుదారులకు ఉచితంగా ఇస్తున్నాం.
- వాస్తవానికి ఇవి ఏప్రిల్‌లో ఇవ్వాల్సి ఉంది. కానీ, మార్చి 29నే ఇస్తున్నాం
- ఉచితంగా రేషన్‌తో పాటు రూ.వెయ్యి నగదు కూడా అందజేస్తున్నాం.
- ప్రైవేటు సంస్థలు కూడా విధిగా తమ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి.
- నిబంధనలు అతిక్రమించిన సంస్థలపై చర్యలు తీసుకుంటాం