దగాపడిన ఉద్యోగులకు మద్దతుగా హస్తినలో "ఆర్ఆర్ఆర్" దీక్ష

మంగళవారం, 18 జనవరి 2022 (16:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దగాపడిన ఉద్యోగులకు మద్దతుగా ఢిల్లీలో దీక్ష చేయనున్నట్టు వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. వీరికి మద్దతుగా రివర్స్ పీఆర్సీకి నిరసనగా బుధవారం ఢిల్లీలో దీక్ష చేస్తానని తెలిపారు. ఈ దీక్ష ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగుతుందని చెప్పారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. కానీ, వారికి రివర్స్ పీఆర్సీ రూపంలో మంచి బహుమతి ఇచ్చారని చెప్పారు. ఇలాంటి కోతలు చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ అసంతృప్తితోనే ఉన్నాయని చెప్పారు. ఈ అంశంలో ప్రభుత్వ ఉద్యోగులకు తాను సంఘీభావం తెలుపుతున్నట్టు రఘురామరాజు మగళవారం ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు