పెన్నా ఛార్జి షీట్ నుంచి తన పేరు తొలగించాలని సీబీఐ కోర్టులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్పై, కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది.
పెన్నా కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేస్తూ, ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరారు. రాజగోపాల్, శామ్యూల్ డిశ్చార్జి పిటిషన్లపై విచారణను ఈ నెల 22కు, ఇండియా సిమెంట్స్ కేసు విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.