నిమ్మగడ్డ చంద్రబాబు ఒత్తిడితో దిగజారుడు పనులు చేస్తున్నారు: రోజా

ఆదివారం, 24 జనవరి 2021 (18:56 IST)
కోవిడ్ తక్కువ ఉన్న సమయంలో ప్రజల ప్రాణాలకు ముప్పు అన్నారు. ఇప్పుడు కరోనా పెద్ద ఎత్తున విజృంభిస్తున్న సమయంలో ఎస్ఈసీ నిర్ణయం సబబు కాదు. వాక్సిన్ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగులు, ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏంటి..? అని ప్రశ్నించారు రోజా.
 
సీఎం జగన్ ఎన్నికలకు భయపడి పారిపోతున్నాడని ఆరోపించడం సమంజసం కాదు. 2018లో చంద్రబాబు స్థానిక ఎన్నికలు చూసి పారిపోయాడు. కోవిడ్ సమయంలో ఎవరికీ ఎటువంటి సహాయ సహకారాలు చంద్రబాబు అందించలేదు. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పు వస్తుందని అనుకుంటున్నా.
 
ఎన్నికలు జరపాలని న్యాయస్థానం ఆదేశిస్తే, న్యాయస్థానాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతాం. ప్రజల శ్రేయస్సు కోసమే ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నాం. ఎన్నికలకు వైసీపీ పార్టీ ఎప్పుడైనా సిద్దమే, మా సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష.
 
కలెక్టర్ గారి ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసాం. అధికారులతో పాటు మాకు అభివృద్ధిపై బాధ్యత ఉంటుంది. కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకపోవడం బాధ వేసింది అని అన్నారు రోజా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు