అచ్చం మనిషిలాగే అటుఇటూ కదులుతూ పనిచేసే ఈ రోబో పోలీసు, ప్రజలను పలకరిస్తుంది, గుర్తు పడుతుంది, ఫిర్యాదులను విని సమాధానాలు కూడా ఇస్తుంది. అనుమానితులను గుర్తిస్తుంది. అలాగే బాంబులను గుర్తిస్తుంది.
హైదరాబాదులోని టీహబ్‌లో స్టార్టర్ కంపెనీ హెచ్-బోట్స్ రోబోటిక్స్ బీటా వెర్షన్ రోబో పోలీసును రూపొందించింది. ప్రపంచంలో ట్రాఫిక్ విధులను నిర్వహించే రెండో రోబో పోలీసుగా ఇది చరిత్రకెక్కనున్నట్టు గత జూలైలోనే హెచ్-బోట్ ప్రకటించింది. ఇప్పటికే తొలి రోబోను పోలీసును ఫ్రాన్స్‌లో రూపొందించి దుబాయ్‌కి తరలించారు. దుబాయ్‌లో ప్రస్తుతం రోబో పోలీసు విధులను నిర్వహిస్తోంది.