ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నవ్యాంధ్రపై ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర సర్కారు కక్ష కట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత నెలలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో అమరావతిలో సచివాలయ నిర్మాణానికి కేవలం లక్ష అంటే లక్ష రూపాయులు మాత్రమే కేటాయించింది.
అదేసమయంలో అమరావతిలో రూ.6.69 కోట్ల వ్యయంతో జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (జీపీఏవో, కేంద్ర ఉద్యోగుల నివాసాలు) కోస భూమి కొనుగోలుకు కూడా కేంద్రం రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం. దీని కోసం ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం రూ.4.48 కోట్లను ఖర్చు చేయగా, ఈ ఆర్థిక బడ్జెట్‌లో రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం.