సంగమేశ్వర ఆలయాన్ని మూడు ఏరులైన పిల్లేరు, వడ్డేరు, కల్లేరు సంగమ స్థానంలో పరశురాముడు ప్రతిష్టించాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివుని వరం కారణంగా గంగమ్మ ప్రతి కార్తీకమాసం మూడు రోజుల పాటు శివుని తాకి తన్మయత్వoతో పరవశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఆలయంలో నీరు భూమి నుంచి ఊటలాగా పైకి ఊరుతుందని స్థానికులు తెలియజేస్తున్నారు.
ఏ శివాలయంలో జరగని విధంగా ఇక్కడ ఈ దృశ్యం చోటు చేసుకొంటుంది. ప్రతి ఏటా ఇలానే ఇక్కడ జరుగుతుంది. ఆలయ అర్చకులు ఆ నీటిలోనే శివునికి పూజలు చేస్తారు. ఇక్కడికి వచ్చి, స్వామి వారిని ఏమి కోరుకొన్నా జరుగుతుందని, ఏల్నాటి శని సైతం ఈ ఆలయంలో శివుని దర్శనంతో ఉపసమనం కలుగుతుందని భక్తుల అంచలంచల నమ్మకం. ఈ విశేషాన్ని కనులారా చూసేందుకు భక్తులు రామేశ్వరానికి వస్తున్నారు. కార్తీక మాసం పుణ్యతిధి అని, ఈ సమయంలో స్వామి వారి దర్శనం మహాభాగ్యమని భక్తులు పేర్కొంటున్నారు.