సంక్రాంతి ఉత్సవాల్లో భాగమైన పందెంకోడి పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే పందేల్లో ఓడిపోతున్న కోళ్లను అక్కడికక్కడే చికెన్ పకోడీగా మార్చేస్తున్నారు. ఓడిన పందెం కోడి చికెన్ పకోడీలను తినడం కోసం జనాలు ఎగబడుతున్నారు. అలాగే మటన్, ప్రాన్స్, చికెన్, ఫిష్ లాంటి వెరైటీ నాన్ వెజ్ వంటకాలను ఎంజాయ్ చేస్తూ పందెపురాయుళ్లు హుషారుగా పందేలు కాస్తున్నారు.
ఈ క్రమంలో, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేలు భారీగా సాగుతున్నాయి. అందులోనూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. ఓ పక్కన పందెం కోళ్లు కత్తులు దూస్తుంటే, మరోవైపు పందెంరాయుళ్లు మాంసాహార వంటకాలను ప్లేట్లు ప్లేటు లాగించేస్తున్నారు.