ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (08:46 IST)
ప్రస్తుతం ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొనివుంది. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 13వ తేదీ జరుగనుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. 
 
ప్రస్తుతం ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలు, తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. వీరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బచ్చు అర్జునుడు, వైకాపా నేతలు పోతుల సునీత, గంగుల ప్రభాకర్ రెడ్డి, దివంగత చల్లా భగీరథ రెడ్డి, పెన్మత్స సూర్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు ఉన్నారు. వీరంతా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యారు.
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, నవీన్ రావు, గంగాధర్ రావుల పదవీ కాలం కూడా త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను జారీ చేసింది. మార్చి 6న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 14న నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 23న పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు. అదే రోజున ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు