చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం- 13న స్కూళ్లు రీ-ఓపెన్

సెల్వి

సోమవారం, 10 జూన్ 2024 (12:50 IST)
ఏపీ రాష్ట్రంలో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజా ప్రకటనతో ఒక రోజు తర్వాత అంటే.. ఈ నెల 13న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మరో రోజు వేసవి సెలవుల గడువును పొడిగించింది.

ఇకపోతే.. రాష్ట్రంలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యా‌ శాఖ వేసవి సెలవులు ప్రకటించింది. సెలవుల అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 13 నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు