దేశంలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు రెండెంకల దిగువకు వచ్చిన కరోనా కేసులో మళ్లీ మూడంకెలకు చేరుకున్నాయి. దీనితో మరోసారి ప్రజల్లో కరోనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలావుంటే ఏపీలో ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాఖాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉదయం 7.45 నిమిషాల నుంచి 11.30 నిమిషాల వరకూ బడులు నడుస్తాయన్నారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం వుంటుందని చెప్పుకొచ్చారు.
ఒకవైపు కరోనావైరస్ ఇంకోవైపు వేసవి ఎండల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐతే మరోసారి కరోనా విజృంభణ సాగుతున్న ఈ పరిస్థితుల్లో పాఠశాలలు నిర్వహించడం అవసరమా అనే చర్చ కూడా జరుగుతోంది.