తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాఠశాలల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అనేక మంది విద్యార్థులు, టీచర్స్ కరోనా బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వం కూడా తరగతుల నిర్వహణపై పునరాలో చేస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారు. పాఠశాలల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా హైదరాబాద్ నాగోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో స్కూల్‌ను మూసివేశారు. తోటి ఉపాధ్యాయులకు వైద్య అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. బుధవారం నాగోల్‌లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో 38 విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు భయాందోళనకు గురతున్నారు. అప్రమత్తమైన అధికారులు కోవిడ్ టెస్టింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 184 మంది విద్యార్ధినులకు పరీక్షలు చేయగా.. 38 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.