మాండూస్ తుపాను : ముందుకొచ్చిన సముద్రం.. ఎక్కడ?

శుక్రవారం, 9 డిశెంబరు 2022 (20:56 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా నెల్లూరు జిల్లా మైపాడులో సముద్రం ముందుకు వచ్చింది. ఈ తుపాను ప్రస్తుతం చెన్నైకు 130 కిలోమీటర్లు, తీరం దాటే ప్రాంతంగా అంచనా వేస్తున్న మహాబలిపురానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది. 
 
అయితే, ఈ తుపాను ప్రభావం కారణంగా నెల్లూరు మైపాడు బీచ్ వద్ద సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పైగా, ఈ ప్రాంతంలో సముద్రం 30 మీటర్ల మేరకు ముందుకు వచ్చింది. తుపాను ప్రభావంతో గాలుల వేగం క్షణం క్షణం పెరిగుతోంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గాలుల తీవ్ర పెరిగిన దృష్ట్యా మైపాడు బీచ్‌‍కు సందర్శకులు రాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు