ఆస్తి గొడవలు.. పెద్ద భార్య కొడుకును కత్తితో పొడిచి చంపిన రెండో భార్య
గురువారం, 15 సెప్టెంబరు 2016 (12:30 IST)
కడప జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలా కారణంగా పెద్ద భార్య కుమారుడిని రెండో భార్య దారుణంగా హత్య చేసింది. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కడప పట్టణంలోని కోనేటి కాల్వ వీధికి చెందిన సురేష్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య కుమారుడు సుజన్. సురేష్‌కు రెండో భార్య ప్రేమ. గత కొంతకాలంగా వీరి మధ్య ఆస్తి గొడవలు, కుటుంబ కలహాలు నడుస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రేమ, సుజన్‌ను కత్తితో పలుమార్లు పొడిచి చంపి, ఆపై తానూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ప్రేమ తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.