రైతు చేయిని కొరికిన చేప... అరచేతిని తొలగించిన వైద్యులు!!
చెరువును శుభ్రం చేస్తుండగా, ఓ రైతు చేయిని చేప ఒకటి కొరికింది. దీంతో వైద్యులు ఆయన అరచేతిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేప కొరకడం వల్ల గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. ఈ తరహా బ్యాక్టీరియా లక్ష మందిలో ఒకరిద్దరికి మాత్రమే సోకే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇది మెదడుకు వ్యాపిస్తే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించిన వైద్యులు... చివరకు ఆ రైతు అరచేతిని తొలగించారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈ ఘటన నిజంగానే జరిగింది. కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.