టికెట్ కొనుగోలు సమయంలో లేదా ప్రయాణ సమయంలో సీనియర్ సిటిజన్ల నుండి వయస్సు ధృవీకరణ పత్రంగా ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాస్‌పోర్ట్ లేదా రేషన్ కార్డ్‌లను అంగీకరించాలని బస్సు డ్రైవర్లు, కండక్టర్‌లను ఆదేశించారు.
ప్రయాణీకులు ఈ పత్రాలలో దేనినైనా భౌతిక రూపంలో లేదా డిజిటల్ రూపంలో సంబంధిత సిబ్బందికి చూపించాలి. "60 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వం జారీ చేసిన భౌతిక రూపంలో లేదా డిజిటల్ రూపంలో వారు ఏ రాష్ట్రానికి చెందిన వారితో సంబంధం లేకుండా 25 శాతం రాయితీని పొందగలరు" ఏపీఎస్సార్టీసీ వెల్లడించింది.
ఈ క్రమంలో దీనిని అమలు జరిగేలా చూడాలని ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లను ఏపీఎస్సార్టీసీ ఆదేశించింది. ఇంతకుముందు, 25 శాతం రాయితీ ఆంధ్రప్రదేశ్‌లోని సీనియర్ సిటిజన్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా 2020లో రాయితీ నిలిపివేయబడింది.
తెలుగుదేశం పార్టీ (టిడిపి), దాని మిత్రపక్షాలు ఎన్నికలలో వాగ్దానం చేసిన మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా ఏపీఎస్సార్టీసీ ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ పథకాన్ని అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.